తెలంగాణ సరిహద్దులో మళ్లీ ఎదురు కాల్పులు

మావోయిస్టు మృతి

చత్తిస్ ఘడ్, మహానాడు:  తెలంగాణ, చత్తిస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టు, పోలీసులకు మధ్య ఈ రోజు ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా తెలిసింది. దీంతో, సరిహద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎదురు కాల్పులకు సంబంధించిన వివరాలు ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ వెల్లడించారు.

చత్తిస్ ఘఢ్ తెలంగాణ లోని సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం ఉదయం 07.00 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజా పూర్ జిల్లా ఎల్మిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీమలదొడ్డి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరవ సారి గుట్ట సమీపంలో దాదాపు 20 మంది నిషేధిత సిపిఐ (మావోయిస్టు) తీవ్రవాదులు ఆలివ్ గ్రీన్ యూనిఫాం తుపాకులను ధరించి పోలీసులపై కాల్పులు జరపడం ప్రారంభించారు.

పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూనే ఉండగా కాల్పులు ఆపాలని, ఆయుధాలు వదిలి లొంగిపోవాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, సీపీఐ మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే ఉండగా ఆత్మ రక్షణ కోసం మా పోలీస్ పార్టీ కూడా ఎదురు కాల్పులు జరిపారన్నారు. ఈ ఎదురు కాల్పులు 15 నిమిషాలకు పైగా కొనసాగాయి, అవతలి వైపు నుంచి కాల్పులు ఆగి పోగా ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయగా, తుపాకీ గాయాలతో చనిపోయిన మావోయిస్టు కనిపించాడని అన్నారు.

సంఘటన స్థలం నుండి ఒక 9 ఎం ఎం కార్బైన్ తుపాకీ, తూటాలు, మందు గుండు సామగ్రి, డిటోనేటర్, సిపిఐ మావోయిస్టు సాహిత్యం కిట్ బ్యాగులు, ఇతర రోజువారీ వినియోగ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని  అన్నారు..