నేను ఇచ్చిన మరో హామీ నెరవేరింది

– మంత్రి నారా లోకేష్‌

అమరావతి, మహానాడు: యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చింది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో నన్ను కలిసి విన్నవించారని  రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేరోజు అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నాం… తెలుగుదేశం పార్టీ బీసీల పుట్టినిల్లు… వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.