-కొత్త బ్రాండ్లకు అనుమతి ఎలా మంజూరు చేశారు?
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ ఎన్.వి.సుభాష్ మాట్లాడా రు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు లిక్కర్ మార్గం ఎంచుకుంది.రాష్ట్రంలో బీర్ల కొరత సృష్టించి, 5 కొత్త బ్రాండ్లను తీసుకొచ్చింది.కొత్త బ్రాండ్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.42 వేల కోట్ల ఆదాయం గడిరచింది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త ఆశ పుట్టుకొచ్చింది.
దీని వెనుక ఎవరు ఉన్నారు…
సోం డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ లిమిటెడ్ అనే కంపెనీ తన బ్రాండ్ బీర్లను అమ్ము కునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇది కాంగ్రెస్ మధ్యప్ర దేశ్‌కు చెందిన పెద్ద నాయకుడిదని తెలుస్తోంది. ఈ కొత్త బ్రాండ్ల ఎంట్రీ వ్యవహా రంలో ఇంకెవరెవరు ఉన్నారో అనే విషయంపై అనేక అనుమానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన సోం డిస్టిలరీస్‌ను బ్యాక్ డోర్ ఎంట్రీగా తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఫండిరగ్‌లో ఈ సంస్థ గురుదక్షణ కింద కీలకంగా వ్యవ హరించినట్లు ఆరోపణలున్నాయి. ఢల్లీి పెద్దల సూచనల మేరకు కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి లిక్కర్ మీద ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రయత్ని స్తోంది. మద్యం బ్రాండ్ కోసం మాకెవరూ దరఖాస్తు చేసుకోలేదంటూ మే 21న మంత్రి జూపల్లి ప్రకటించారు. కానీ, 5 కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతులు ఎలా మంజూరు చేసింది? అని ప్రశ్నించారు.
రైతు సమస్యలను గాలికొదిలారు
పత్తి విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తే దుర్మార్గంగా పోలీసులు దాడికి పాల్పడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాక రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగం పట్ల రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 100 రోజుల్లోనే వందలాది మంది రైతులు మరణించారు. కొందరు కరెంటు షాకులతో, మరికొం దరు ఆత్మహత్య చేసుకోవటం బాధాకరం. రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ గారిని తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ఆహ్వానించే ఉత్సుకతతో ఉన్నారు. ఏ హోదాలో ఆహ్వానిస్తున్నారనే దానిపై కాంగ్రెస్ నాయకుల నుంచి సమాధానం లేదు. బోగస్ మాటలు చెబుతూ శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఆరు హామీలకు పంగనామం పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి రెండే తెలుసు నని, గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మాటలు చెప్పి రైతులను, ప్రజలను గాలి కొదిలేయడం మొదటిదని, లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం, కాంట్రాక్టర్లు, వ్యాపా రుల దగ్గర వేలకోట్లు ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢల్లీికి కప్పం కట్టడం రెండోదని ఎద్దేవా చేశారు.