హడ్కో సంస్థ నుంచి మరో తీపికబురు

అమరావతి, మహానాడు: ఏపీకి ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మరో తీపి కబురు అందింది. రాష్ట్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో హడ్కో ఛైర్మన్ సంజయ్ కుల్ శ్రేష్ఠ సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ రంగ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేయడానికి హడ్కో అంగీకరించింది.