నూతన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు
విజయవాడ, మహానాడు: విజయవాడ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించటం పూర్వ జన్మ సుకృతమని రాజశేఖర్ బాబు అన్నారు. శనివారం విజయవాడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజశేఖర్ బాబు మాట్లాడుతూ..
నా బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తా. ప్రజల్లో నమ్మకాన్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. వినూత్న రీతిలో పోలిసింగ్ నిర్వహిస్తాం. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం పై దృష్టి పెడతాం. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చు. గ్రీవెన్స్ సెల్ ను మరింత పటిష్టం చేస్తామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడతాం. సీసీ కెమెరాలు పని తీరును మెరుగుపరుస్తామన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టెందుకు అందరూ సహకరించాలి. ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారిస్తాం. గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు.
డే, నైట్ బీట్స్ మరింతగా పెంచుతాం. సైబర్ క్రైమ్స్ విషయంలో వినూత్న రీతిలో ముందుకు వెళ్తాం. 200 మంది సిబ్బందిని సైబర్ కమాండర్స్ గా నియమిస్తాం. రోడ్ సేఫ్టీ పై దృష్టి పెడతాం. కమ్యూనిటీ పోలిసింగ్ అమలు చేస్తామని పేర్కొన్నారు.