– ఫలించిన మంత్రి నారాయణ ఢిల్లీ పర్యటన
న్యూఢిల్లీ: హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో) అధికారులతో ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణం, నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలకు హడ్కో నుంచి రుణసదుపాయంపై చర్చ జరిగింది. అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ ఆలోచన విధానాన్నిహడ్కో అధికారులకు మంత్రి వివరించారు. అమరావతి నిర్మాణం కోసం ఏపీ సీఆర్డీయే కు 11,000 కోట్ల రుణం మంజూరుకు హామీ లభించింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పెండింగ్ లో ఉన్న 165 కోట్లు రుణం విడుదలకు హడ్కో అంగీకరించింది. వారం రోజుల్లో రుణం ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ సమావేశంలో హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, హడ్కో విజయవాడ రీజినల్ చీఫ్ బీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు.