శ్రీకాకుళం: కేంద్ర కేబినెట్లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెల్లడిరచారు. ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం. చాలా కాలం తర్వాత కేంద్రమంత్రి పదవి దక్కింది. కేంద్రంతో సఖ్యతే మాకు ముఖ్యం. మా మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం. రిజర్వేషన్ల అంశంలో మా ఆలోచనలో మార్పు లేదు అని స్పష్టం చేశారు.