-ఏ.బి. వెంకటేశ్వరరావుగారికి హృదయపూర్వక అభినందనలు
ఫ్యాక్షనిస్టు మనస్తత్వంతో ఐదేళ్ళు పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యలకు ఎదురొడ్డి నిలిచి, ఐదేళ్ళ పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, గెలిచి, సస్పెన్షన్ ఎత్తివేసేలా ప్రభుత్వం మెడలువంచి, విజేతగా నిలిచి, గర్వంగా అధికారిక హోదాలో పదవీ విరమణ చేస్తున్న, ఆంధ్రప్రదేశ్ లోని ఐపిఎస్ అధికారుల్లో అగ్రస్థానంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారి ఏ.బి. వెంకటేశ్వరరావుకి హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో వారి సేవలు ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఎంతైనా అవసరమని భావిస్తున్నాను.
మనది అత్యంత లోపభూయిష్టమైన వ్యవస్థ. అధికార పీఠమెక్కిన వ్యక్తి ఈ తరహా కక్ష సాధింపు చర్యలకు పూనుకొంటే, న్యాయ స్థానాల్లో సత్వర న్యాయం లభించకపోతే, వాటిల్లే నష్టం సంబంధిత వ్యక్తికే కాదు, సమాజానికి కూడా పూడ్చలేనిదనడానికి ఏ.బి. వెంకటేశ్వరరావు ఉదంతమే ప్రబల నిదర్శనం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడి అక్రమ జీవోలతో అక్రమ పదోన్నతులు కల్పించారు. పర్యవసానంగా అర్హులైన, నిజాయితీగా ఉద్యోగం చేస్తున్న వారు ఎందరో తీవ్రంగా నష్టపోయారు. అలా నష్టపోయిన వారిలో వైద్య విద్యాశాఖలో నా జీవిత భాగస్వామి ఒకరు.
అక్రమ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టులో ఒకదాని తర్వాత ఒకటి, మూడు రిట్ పిటిషన్స్ దాఖలు చేసి, ఏడాదిన్నర పాటు న్యాయ పోరాటం చేసి, మూడు రిట్ పిటిషన్స్ లో విజయం సాధించి, పదోన్నతి సాధించుకోవడం జరిగింది. కానీ, దాదాపు ఏడాదిన్నర కాలం నష్టపోవడం జరిగింది. ఇలా న్యాయ పోరాటం చేయని వారు నష్టపోతూనే ఉన్నారు. న్యాయ పోరాటంలో న్యాయం విజయం సాధిస్తుందన్న “గ్యారెంటీ” కూడా ఈ వ్యవస్థలో లేదు.
ఇటీవల ఒక పెళ్ళిలో ఏ.బి. వెంకటేశ్వరరావుతో ముచ్చటిస్తున్న దృశ్యం. నా జీవిత భాగస్వామి, నేటి ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన డా.ప్రశాంతి కొల్లి కూడా ఫోటోలో ఉన్నారు.
– టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు