గుడ్లవల్లేరు ఘటన తేల్చేందుకు ప్రత్యేక అధికారిని నియామకం

మచిలీపట్నం, మహానాడు: గుడ్లవల్లేరు లోని శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహంలో కెమెరాలు దాగి ఉన్నట్టు వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ రమణమ్మను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. వారు కాక మరో 5 మందితో కలిసిన పోలీస్ సాంకేతిక సిబ్బందితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు.