బాలలపై యథేచ్ఛగా దాడులు!

– హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆవేదన

గుంటూరు, మహానాడు: బాలలపై యథేచ్ఛగా దాడులు చోటుచేసుకుంటున్నాయని, 2023 నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 1.62 లక్షల మంది బాలలు అనేక రకాలుగా దాడులకు గురవుతున్నారన్నారు. ఇంకా…ఠాకూర్ మాట్లాడుతూ అందులో 83 వేల మంది బాలల కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి. 2021 తో పోల్చుకుంటే ఇప్పుడు 7.5 శాతం బాలలపై దాడులు పెరిగాయి. బాలల పై కిడ్నాప్ లు ,బెదిరింపులు పెరిగాయి, ఫోక్సో కేసులు పెరుగుతున్నాయి… ఫోక్సో కేసులలో తీర్పులు కఠినంగా ఉన్నా ,నేరాల తీవ్రత పెరుగుతుంది..

బాలల పై జరుగుతున్న దాడులు, కారణాలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి.సమాజం బాలలకు రక్షణగా నిలవాలి… అవసరం ఐతే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించి, బాలల పై జరుగుతున్న దాడులు ను నియంత్రించే విధానాన్ని ఉపయోగించాలి… ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ల ప్రకారం నమోదయిన కేసులను కారణాలను అన్వేషించాలి.. భవిష్యత్ లో బాలల పై జరుగుతున్న దాడులను నియంత్రించాలి.