ఆగస్టు 15 లోపు హామీలు నెరవేరుస్తావా…
ఒట్లు పెట్టినా నమ్మే స్థితిలో జనం లేరు
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, మహానాడు : ఒకవైపు నీళ్లు లేక పంట ఎండిపోతుంటే..మరోవైపు కోసిన పంటను కొనుగోలు చేయకపోవ డం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర కార్యాలయంలో సోమవా రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తడిసిన పంటను కూడా కొనుగోలు చేస్తా అని చెప్పి మోసగించారు. పంటలకు గిట్టుబాటు ధర లేదు, బోనస్ లేదు. దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నా సీఎంను నమ్మేస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. ఆరు హామీలకు ఇన్ని ఒట్లు పెడితే మీరిచ్చిన 412 హామీలకు ఎంతమంది ఒట్లు పెట్టాలని ప్రశ్నించారు. జోగులాంబ, నరసింహ స్వామి, పోషమ్మ, రాముని మీద ఒట్లు పెట్టే పరిస్థితి వచ్చింది.
ఇవన్నీ చూస్తుంటే ఆగస్టు సంక్షో భంలో కొట్టుకుపోతాడో ఏమో అని, ఆగస్టులోనే రుణమాఫీ చేస్తా అంటుండు. ఆగస్టు 15 లోపు నెరవేర్చకపోతే రాజీనామా చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తదేమో అని కోమటిరెడ్డిని ముందే సీఎంగా ప్రకటిస్తుండేమో అన్న అనుమానం కలుగుతుందన్నారు.