-పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం
-మేం పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని తీసుకువస్తాం
-నల్లబెల్లం రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపు
-ఎంపీ కుటుంబ సభ్యుల్నే కిడ్నాప్ చేస్తే ఇక మనపరిస్థితి ఏమిటో ఆలోచించండి
– అనకాపల్లి నియోజకవర్గం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్
అనకాపల్లి : నేను ఐటీగా మంత్రిగా ఉన్నప్పుడు నెలకు రెండు ఐటీ కంపెనీలు తీసుకువస్తే.. నేడు వారానికో కిడ్నాప్, భూకబ్జా, మర్డర్ లు చోటుచేసుకుంటున్నాయి. మళ్లీ వైసిపి వస్తే మన ఇళ్లు,పొలాలు కూడా వైసీపీ నేతలు కబ్జా చేస్తారు. వైకాపా ఎంపీ కుటుంబ సభ్యుల్నే కిడ్నాప్ చేస్తే, ఇక మనపరిస్థితి ఏమిటో ఆలోచించండి. వైకాపా భూకబ్జాలకు సహకరించలేదని ఎమ్మార్వో రమణయ్యను కిరాతకంగా హత్య చేశారు.
జగన్ పదేపదే సిద్ధం అంటున్నారు. ఆయన రాప్తాడుకు వెళితే వైకాపా నాయకులు, కార్యకర్తలు తాము సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఖాళీగా ఉన్న కుర్చీలను ఫోటోలు తీస్తుంటే అక్కడున్న మీడియా మిత్రుడ్ని వైకాపా రౌడీలు చితకబాదారు.
నేను పాదయాత్రలో చంద్రబాబు చేసిన అభివృద్ధిపై 25 సెల్ఫీలు దిగాను. ఆనాడే జగన్ కు ఛాలెంజ్ చేశా. సంక్షేమం, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరా. అయినా అవతలనుంచి సౌండ్ రాలేదు. వెయ్యి పైన జబ్బులకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసి, పెండింగ్ బకాయిలు పెట్టి నాశనం చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి మోసం చేశారు.
అనకాపల్లి అంటే తెలుగుదేశం కంచుకోట. అనకాపల్లి బెల్లం ప్రపంచం మొత్తం ఫేమస్. 2014 నుంచి 2019 వరకు పీలా గోవింద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. 2600 టిడ్కో ఇళ్లు కట్టించి నిరుపేదలకు అందించాం. అంగన్ వాడీ భవనాలు, తాగునీటి వసతి, పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు టీడీపీ హయాంలోనే నిర్మించాం.
ఆనాడు ఏకంగా 100 పరిశ్రమలు తీసుకువచ్చి 15వేల మందికి ఉపాధి కల్పించాం. చోడవరం- చిట్టకాడ రోడ్డు కూడా ఆనాడు మనం అభివృద్ధి చేశాం. 220 కోట్ల రూపాయలు ఆనాడు పంచాయతీ రాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి కేటాయించి ఇంటింటికి కుళాయి ద్వారా నీరు అందించేందుకు కృషిచేస్తే ఈ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిపివేసింది. మన హయాంలో 145 కి.మీ సీసీ రోడ్లు నియోజకవర్గంలో వేశాం. 21వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించాం.
మనం పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం. ఏనాడూ కోడిగుడ్డు మంత్రి వద్దకు వెళ్లి హామీలు అమలుచేయాలని అడగలేదు. ఇక్కడున్న ఎమ్మెల్యేకు నేను ఓ గిఫ్ట్ ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువును తీసినందుకు మంత్రి గారికి కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. ఇది అన్నగారికి డెలివరీ చేయాలి.
చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి అయితే నియోజకవర్గం ఏ స్థాయిలో ఉండాలి? మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా ఉద్యోగం కల్పించారా అని కోడిగుడ్డు మంత్రిని ప్రశ్నిస్తున్నా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పరిశ్రమ అయినా తీసుకువచ్చారా? 600 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేశారు. గ్రావెల్, మెటల్ దొబ్బేస్తున్నారు. బినామీ పేర్లతో ల్యాండ్ పూలింగ్ లో కూడా దందా జరిగింది. ఎమ్మెల్యే చుట్టూ ఉన్న నలుగురు తోడుదొంగలు మన బిడ్డలను గంజాయికి బానిసలుగా చేశారు. గంజాయి వల్ల ఎలా నాశనం అయ్యారో నేను పాదయాత్రలో చూశా.
టీడీపీ-జనసేన బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి. మూతపడిన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. రైతులకు న్యాయం చేస్తాం. కాపు భవనాల పెండింగ్ పనులు పూర్తిచేస్తాం. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా ఉచితంగా తాగునీటి వసతి కల్పిస్తాం.
కశింకోట రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి సాగునీరు అందిస్తాం. నల్లబెల్లం రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపు. ఎందుకు ఈయన కల్తీ మద్యం అమ్మేదానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే నల్లబెల్లం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. నల్లబెల్లం రైతులను ఆదుకుంటాం.
అనకాపల్లిలో రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో నాకు తెలుసు. పాదయాత్రలో ఎక్కడా రాని విధంగా నాకు ఈ నియోజకవర్గంలో కాలి నొప్పి వచ్చింది. అద్భుతమైన రోడ్లు వేస్తాం. డి-ఫామ్ పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తాం. ఎన్టీఆర్ హాస్పిటల్ లో మెరుగైన వసతులు కల్పిస్తాం. మన నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటుచేస్తాం.