పులివెందులలోని అక్రమాలపై విచారణకు సిద్ధమా…?

– జగన్ పాలనలో ఒక్క పులివెందలలోనే రూ.100 కోట్లు దుర్వినియోగం
– పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా నాటకాలు
– జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సవాల్‌

మంగళగిరి, మహానాడు: రాష్ట్రంలో రైతులను, పేదలను పట్టించుకునే వాళ్ళ లేరు అంటూ… రాష్ట్రం మొత్తం అచేతన వ్యవస్థలోకి వెళ్లిపోయిందని అపసోపాలు పడుతూ.. తానే ప్రజారక్షకుడిగా, మంచి పరిపాలన అందించానని చెప్పి జగన్ మోహన్ రెడ్డి బీరాలు పలుకుతున్నాడని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్లూ మీడియా ద్వారా ఇష్టానుసారంగా ప్రజల్లో గందరగోళం ఏర్పడే విధంగా.. రైతులకు ఏ విధంగా మేలు జరగలేదని జగన్ రెడ్డి దుష్పప్రచారానికి తెర లేపారు.. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు… జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందలలో జరిగిన అన్యాయాలకు.. అక్రమాలను విచారించడానికి సిద్ధమా అని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా” అని సవాల్ చేశారు.

జగనన్న ఇళ్లలో అంతా అవినీతే..

రాష్ట్రంలో లక్షలాది గృహలను నిర్మించామని చెబుతున్న జగన్ రెడ్డి .. పులివెందలలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై చర్చకు సిద్ధమా? నియోజకవర్గంలో కాదు, కనీసం మున్సిపాలిటీల్లోని జగనన్న లేఅవుట్‌లో జరిగిన అక్రమాలపై పులివెందలలోనైనా, తాడేపల్లిలోనైనా చర్చకు నేను సిద్ధం. పులివెందల మున్సిపాలిటీలోని జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు 8,456 గృహాలు మంజూరైతే… ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు 2,489 మంది లబ్దిదారులు .. బోగస్ లబ్దిదారులు, అనర్హలు అని తేల్చింది. అంటే ఒక్క పులివెందుల మున్సిపాలిటీలో రూ.175 కోట్లల స్కాం జరిగిందంటే… ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 174 నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల రూపాయలు స్కాం జరిగాయో ఒక్కసారి ఆలోచించాలన్నారు.

పులివెందల మున్సిపాలిటీలో 8,468 ఇళ్ళు మంజూరైతే వీరందరికి ఏపీఐజీసీకి చెందిన 250 ఎకరాల స్థలం తీసుకుని ఒక్కొక్క లబ్ధిదారుని ఒకటిన్నర సెంటు స్థలంలో ప్రభుత్వమే కాంట్రాక్టర్లను నియమించి గృహ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. దీనిలో జగనన్న మెగా లేవుట్లో 7వేల 75 ఇళ్లు మంజూరు చేస్తే దానిలో 16వందల 75 మంది అనర్హలు అని తేలింది. అంటే దాదాపు 23.67 శాతం మంది బోగస్ లబ్ధిదారులు .. వైకాపా బినామీలు ..దొంగపేర్లు పెట్టుకుని కోట్లాది రూపాయలు కాజేసినది నిజం కాదా జగన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నా… అంతేకాకుండా సొంత స్ధలాలు ఉన్నాయని గృహాలు మంజూరు చేయాలని దరఖాస్తు పెట్టుకున్న వారు 19వందల 18 మంది అయితే వారిలో… పెద్ద పెద్ద భవంతులు, ఇళ్లు వున్నవారు, కోటీశ్వరులు దాదాపు 732 మంది దొంగ లబ్ధిదారులు అందులో ఉన్నారని తేలిన విషయం వాస్తవం కాదా.. అంటే దాదాపు 55.5 శాతం మంది తమకు ఇళ్లు ఉన్నా ..సొంతస్థలాలున్న .. తమకు పెద్ద పెద్ద భవంతులున్నా.. దొంగ పేర్లు పెట్టుకుని ప్రభుత్వం డబ్బు కాజేయాలని మీ కార్యకర్తలు ఇళ్లను మంజూరు చేసుకున్న విషయం వాస్తవం కాదా జగన్ రెడ్డి?” అని ప్రశ్నించారు.

పులివెందుల మున్సిపాలిటీ అంతా దోపిడీ మయం!

రాజీవ్ గాంధీ కాలనీలో 75 ఇళ్లను మంజూరు చేశారు. దానిలో 17 మంది బోగస్ లబ్ధిదారులని తేలిన విషయం వాస్తవం కాదా… అంటే దాదాపు అక్కడ 22.6 శాతం బోగస్ లబ్ధిదారులుగా తేలింది. గతంతలో ఇళ్లు మంజూరైయి ఇళ్ళు కట్టుకున్న, మరోసారి ఇళ్లను మంజూరు చేసిన దానిలో దాదాపు 65 మంది బోగస్ లబ్ధిదారులని తేలిన విషయం వాస్తవం కాదా జగన్ రెడ్డి.. దాదాపు 8 వేల 468 ఇళ్ళో 2489 మంది బోగస్ లబ్దిదారులుగా తేలింది.

పులివెందుల నియోజకవర్గంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క లేఅవుట్ లోనే దాదాపు రూ. 175 కోట్లు స్కాం జరిగింది. దీనిపైన మీరు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా లేరు. కనీసం ప్రతిపక్ష నాయకునిగా కూడా లేరు. ముందు మీకు పనిలేదు. మీరు అక్కడే ఉంటారు.. నేను అక్కడే ఉంటా.. దీనిపై మన ఇద్దరం కలిసి పులివెందుల లేఅవుట్ కు పోదాం… ఎన్ని అన్యాయాలు జరిగాయో, అక్రమాలు జరిగాయె అక్కడే తేల్చుకుందాం. అంతేకాదు పులివెందులలో పాణా ముసుగులో రూ. 100 కోట్ల స్కాం జరిగింది.. దానికి మీరు విచారణకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని సవాల్‌ చేశారు.

పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా జగన్ నాటకాలు

2023-24 కు పంటలకు సంబంధించిన ప్రీమియం ఎందుకు చెల్లించలేదు.. ఈరోజు సాక్షి ప్రతికలో రాశారు .. ఎన్నికల కోడ్ వచ్చినందు వల్ల కట్టలేదు అని.. 2023-24 పంటల బీమా ప్రీమియం మీరు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో చెల్లించాల్సి వుంది. 2023 జూలై 31 న ప్రీమియం గడువు ముగిసింది. ఈ క్రాప్ బుకింగ్ కూడా ముగిసింది. మీరు అప్పడు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా.. ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమా చెల్లించలేదని మాట్లాడుతున్నావు అని విమర్శించారు. 2014-2019 మధ్య రైతులకు ఏమీ జరిగింది.. 2019 -24 ల మధ్య రైతులకు ఏమీ జరిగింది.. ఇప్పటికైనా మీరైనా, మీపార్టీ ప్రతినిధులైనా తెలుసుకుంటే మంచిదని… నేను ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్దం అంటూ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి సవాల్ విసిరారు.