ఏపిలో రేపటి నుంచి ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ బంద్

అమరావతి:  పెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ‘2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2500 కోట్లు రావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం రూ.160 కోట్లు ఇచ్చింది. ఆస్పత్రుల రోజువారీ ఖర్చులకూ డబ్బులు లేవు. అందుకే సేవలు కొనసాగించలేం’ అని ప్రభుత్వానికి లేఖ రాసింది.