రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రుల నిర్ణయం
బకాయిలు చెల్లించలేదని ట్రస్టు సీఈవోకు లేఖ
అమరావతి, మహానాడు : ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు నెట్ వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీషాకు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. తాము మే 2న సేవలు నిలిపివేస్తామని ప్రకటిస్తే కేవలం రూ.50 కోట్లు మాత్రమే ఈహెచ్ఎస్ కింద ప్రభుత్వం చెల్లింపులు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద నయాపైసా కూడా చెల్లించలేదని పేర్కొంది. ఆరోగ్యశ్రీ కింద పెండిరగ్లో రూ.1,500 కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని తక్షణమే చెల్లించాలని పలుసార్లు కోరినప్పటికీ ఉపయోగం లేకపోవడం వల్లే నిర్ణయం తీసుకున్నామని వివరిచింది. లేఖ కాపీలను సీఎస్, ఎన్నికల కమిషన్ సీఈవో, వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రట రీలకు పంపామని వివరించింది.