– సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, మహానాడు: గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేస్తున్న కార్మికులు, ఇతర సిబ్బంది, అధికారులు విశ్రాంతి తీసుకునేందుకు తగు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం నిమజ్జనం వద్ద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు షిఫ్టుల్లో డ్రైవర్స్ ,ఇతర సిబ్బందికి విధులు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నిమజ్జనం ప్రక్రియ ముగిసే వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ అలెర్ట్ గా ఉండాలని పోలీస్ యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు.