Mahanaadu-Logo-PNG-Large

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి

-జూన్‌ 1 నుంచి హాల్‌ టిక్కెట్లు
-అభ్యర్థులకు కమిషన్‌ సూచనలు

హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌కు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి పొరపాట్లు జరగకుండా టీజీపీఎస్సీ జాగ్రత్తలు తీసుకుంది. జూన్‌ 9 జరిగే ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ హాల్‌ టిక్కెట్లను జూన్‌ 1న 2 గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ సూచించింది. 563 గ్రూప్‌ 1 పోస్టులకు 4,03,000 మందికి పైగా అభ్యర్థులు ఈసారి దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే 23 వేల మందికి పైగా ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. మెహందీ, టాటూలు వంటివి అభ్యర్థులు వేసుకోవద్దని, హాల్‌ టిక్కెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించింది. ఉద యం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగుతుందని, గంట ముందే చేరుకోవాలని తెలిపింది.