– ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్
బేగంపేట, మహానాడు: వికారాబాద్ జిల్లా, పూడురు మండలంలో ఇండియన్ నేవీ ఏర్పాటు చేస్తున్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంలో సీఎం తోపాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పూడురు మండలంలోని కార్యక్రమ స్థలికి బయలుదేరారు.