అసెంబ్లీ సమావేశాలు 24 నుంచి

– 24, 25, 26 తేదీల్లో 3 రోజులపాటు సమావేశాలు
– స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు?
– చీఫ్ విప్ రేసులో ధూళిపాళ్ల నరేంద్ర, కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్?

అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి శాసన సభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 24, 25, 26 తేదీల్లో 3 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. 24న ప్రొటెం స్పీకర్‌ని ఎన్నుకున్న తర్వాత, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాగా స్పీకర్‌గా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి మంత్రివర్గంలో ఆయన కు స్థానం దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయ్యన్నను స్పీకర్ పదవికి ఎంపిక చేసే అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.

ఇక చీఫ్ విప్ పదవికి సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఓడించిన కూన రవికుమార్, వైసీపీ సర్కారుపై యుద్ధం చేసి ఆర్ధికంగా-రాజకీయంగా నష్టపోయిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.