– గుంటూరు వేలాంగిని నగర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెదేపా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు
– ప్రచారం ప్రారంభించిన గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, పాల్గొన్న నియోజకవర్గ నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు(నాని)
పెమ్మసాని చంద్రశేఖర్ ఏమన్నారంటే.. ఈ రోజే గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నన్ను ప్రకటించింది. నాకు ఆవకాశం కల్పించిన అధినేత చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ మత్తు మందులన్నీ జనంలోకి వెళ్తే చాలా ప్రమాదం. మత్తు మందుల బారిన పడిన వారిని మాన్పించటం సాధ్యం కాదు.డ్రగ్స్ రావటం వెనక ఎవరు ఉన్నారో తేలాలి. రాష్ట్ర ప్రజలు కూడా ఈ విషయం పై ఆలోచించాలి