• ఫ్యాక్షన్ మనస్తత్వమున్న ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు, ప్రతిపక్షాలతో పాటు ప్రసార మాధ్యమాలకు కూడా రక్షణ లేకుండా పోయింది
• ప్రసారమాధ్యమాలు.. విలేకరులపై వైసీపీ దాడుల్ని తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తోంది
• మీడియా సంస్థకు అధిపతిగా ఉన్న వ్యక్తిపాలనలో సాటి మీడియాసంస్థలు, విలేకరులపై దాడులు బాధాకరం
• చొక్కాలు మడతపెట్టండి అని జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చింది ఇందుకేనా?
• సాక్షి తప్ప, ఇతర మీడియా సంస్థలంటే గిట్టనప్పుడు జగన్ రెడ్డి తన సభలు.. కార్యక్రమాలకు వాటిని ఎందుకు ఆహ్వానిస్తున్నాడు?
• దాడులు.. హత్యలు.. అత్యాచారాలే పదవులకు కొలమానాలని తన చర్యలు..చేష్టలతో జగన్ చెప్పకనే చెబుతున్నాడు.
• దాడులు.. దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న జగన్ ఆటల్ని టీడీపీ-జనసేన సాగనివ్వవు
– టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా
కర్నూలులో ఈనాడు కార్యాలయంపై వైసీపీ అరాచకశక్తుల దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ఓటమిభయంతోనే జగన్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ఇలాం టి నీచ సంస్కృతికి పాల్పడుతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీ రా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే .. “ ప్రశ్నించే గొంతుల్ని చూస్తే జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోంది. తన పాలనలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, విధ్వంసాలపై ప్రశ్నించేవారిని దాడులతో భయపెట్టాలని జగన్ చూస్తున్నాడు. ఆ క్రమంలోనే చివరకు పత్రికా సంస్థలు, విలేకరులపై వైసీపీవారితో దాడులు చేయిస్తున్నాడు. మీడియా సంస్థకు అధిపతిగా ఉన్న వ్యక్తిపాలనలో సాటి మీడియాసంస్థలు, విలేకరులపై దాడులు జరగడం బాధాకరం చొక్కాలు మడతపెట్టండి అని జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చింది ఇందుకేనా?
ఒక మీడియా సంస్థకు అధిపతిగా ఉన్న జగన్ రెడ్డి, సాటి మీడియా సంస్థలపై దాడులు చేయించడం ఎంతమాత్రం సరైన పద్ధతి కాదు. పత్రికాస్వేచ్ఛను కాపాడ లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా అనర్హుడు. ఓటమిభయం.. టీడీపీ, జనసేనపార్టీలకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని జగన్ చివరకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. ప్రజలు, విలేకరులు, పత్రికాసంస్థలు, ప్రతిపక్షాలపై దాడులు చేస్తేనే వచ్చేఎన్నికల్లో సీట్లు ఇస్తాను అన్నట్టుగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. గతంలో ఇలానే ప్రతిపక్ష నాయకులపై దాడి చేసిన వారికి, వారి ఇళ్లవద్దకు వెళ్లి వీరంగం వేసిన వారికి మంత్రి పదవి ఇచ్చాడు. చొక్కాలు మడత పెట్టండి అని చెప్పింది ఇందుకోసమేనా అని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ప్రజాసమస్యలపై పోరాడే మీడియా పై దాడికి పాల్పడే దుస్సాహసం జగన్ రెడ్డి తప్ప, రాష్ట్రచరిత్రలో ఇంతవరకు ఎవ రూ చేయలేదు. మీడియాసంస్థలు.. విలేకరులపై దాడులు చేయించడం జగన్ రె డ్డి ఆకృత్యాలకు, పిచ్చికి పరాకాష్ట అనే చెప్పాలి.
చంద్రబాబు హాయాంలో సాక్షి మీడియాపై టీడీపీ దాడిచేసిందా? జగన్ ఫ్యాక్షన్ భావజాలానికి అనుగుణంగానే వైసీపీ నాయకులు, సాక్షి మీడియా పనిచేస్తున్నాయి. మీడియాను టీడీపీ ప్రభుత్వం ఎంతగానో గౌరవించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడైనా సాక్షి మీడియాపై దాడులు జరిగాయి? ఎలాంటి చర్యలైనా ఆయన తీసుకున్నారా? టీడీపీ శ్రేణులు సాక్షి కార్యాలయాల పై, విలేకరులపై దాడులు చేశారా? రాజకీయ విలువలు తెలిసిన వ్యక్తి కాబట్టే, తర..తమ బేధాలు లేకుండా చంద్రబాబు అందరి నీ సమానంగా గౌరవించారు. నేడు సాక్షి మీడియా టీడీపీపై, మిత్రపక్షం జనసేనపై విషం కక్కుతోంది. దారుణం గా తప్పుడు కథనాలతో దుష్ప్రచారం చేస్తోంది.
జగన్ రెడ్డి తన అవినీతి మీడియా ద్వారా ప్రజానాయకులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై బురదజల్లుతున్నా, వారు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. జగన్ ఫ్యాక్షన్ భావజాలానికి అనుగుణంగానే వైసీపీ నాయకులు, సాక్షి మీడియా పనిచేస్తు న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జగన్ రెడ్డి నేత్రత్వంలో వైసీపీ నాయకులు సాగిస్తున్న దోపిడీ, అవినీతి గురించి సాక్షి మీడియా ఏనాడైనా ప్రశ్నించిందా?
ఏ పత్రిక.. ఏ టీవీ అయినా ప్రజలకోసమే పనిచేస్తుంది గానీ, జగన్ రెడ్డి లాంటి నియంతల కోసం పనిచేయదు. పత్రికాస్వేచ్ఛను అడ్డుకోవడమంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలను ఆపడమేననే వాస్తవాన్ని జగన్ గ్రహించాలి. ప్రసారమాధ్యమా లపై దాడి చేయడమంటే రాజ్యాంగంపై దాడిచేయడమేననే నిజాన్ని వైసీపీ శ్రేణులు తెలుసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారు. జగన్ చర్యలు…వైసీపీ నేతల దాడులు చూస్తుంటే, రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వా మ్యయుతంగా, స్వేఛ్చగా జరిగే పరిస్థితి లేదు ప్రసారమాధ్యమాలు, విలేకరులపై దాడుల్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి.
రాష్ట్రంలో ప్రసారమాధ్యమాలకు, విలేకరులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఏం ఉంటుంది? జగన్ రెడ్డి చర్యలు.. వైసీపీనేతల దాడులు చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, స్వేఛ్చగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రసారమాధ్యమాలు.. విలేకరులపై జరిగిన దాడులపై ఎన్నికల కమిషన్ స్పందించాలి. మీడియా స్వేచ్ఛకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాం. వైసీపీ రౌడీల దాడులు నేడు కొన్ని పత్రికాసంస్థలు.. కొందరు విలేకరులకే పరిమితమయ్యాయి. మీడి యా సంస్థలు ఒక్కటై ఈ ప్రభుత్వంపై తిరగబడకపోతే, అన్నిసంస్థలు.. యాజమా న్యాలు ఏదో ఒకరోజు జగన్ దుశ్చర్యలకు బలికాకతప్పదు.