ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
చందర్లపాడు, మహానాడు: ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ఆదివారం మండలంలోని ముప్పాళ్ళ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శంకర కంటి ఆసుపత్రి, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జిల్లా అంధత్వ నివారణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, ఈ తరుణంలో ఆయా గ్రామాల ప్రజల అభ్యర్థన మేరకు ప్రత్యేక కంటి వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు ఉచిత వైద్యం అందించడం సంతోషకరమన్నారు. అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారన్నారు. ఉచిత కంటి వైద్య శిబిర నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు.