అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి పదవికి అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. ఆయనను గౌరవంగా సభాపతి సీటు వద్దకు తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లకు సూచించారు.
సభ్యుల అభినందనల మధ్య అయ్యన్న పాత్రుడు స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. కాగా, సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు అయ్యన్న పాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, స్పీకర్ పదవికి తనను ప్రతిపాదించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు.