బాబాయ్‌ పాలిటిక్స్‌ పై అబ్బాయి కామెంట్స్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం ఉన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకి ఈ మూవీ రాబోతోంది. పుల్వామా ఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. పాకిస్థాన్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన ఆపరేషన్ ని దృశ్యరూపంలో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా ఫైర్ ఫైటర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. ఇక ఇటీవలె విడుదలైన మూవీ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంది. మానుషీ చిల్లర్ వరుణ్‌కి జంటగా నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పుల్వామా దాడి ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజు జరిగింది. అందుకే ఈ సినిమాకి ఆపరేషన్ వాలంటైన్స్ అని పేరు పెట్టినట్లు మూవీ టైటిల్ పై క్లారిటీ ఇచ్చారు. అలాగే రాజకీయాల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకి కూడా క్లారిటీ ఇచ్చారు. బాబాయ్ జనసేన పార్టీ ద్వారా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నారు. బాబాయ్ చేసే పోరాటంపై మాకు నమ్మకం ఉంది. కచ్చితంగా నా సపోర్ట్ జనసేన పార్టీకే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ ఫాదర్ నాగబాబు జనసేన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికలలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా మరో పక్క నడుస్తోంది. మరి వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు తరుపున ఎన్నికలలో ప్రచారం చేస్తారేమో అనేది వేచి చూడాలి. గత ఎన్నికలలో అల్లు అర్జున్, రామ్ చరణ్ జనసేన తరుపున క్యాంపైన్ చేశారు. ఇప్పటికే నిహారిక జనసేన పార్టీకి, బాబాయ్ పవన్ కళ్యాణ్ కి నా సపోర్ట్ అని ఓ పాడ్ కాస్ట్ లో చెప్పింది. ఇక దాదాపుగా ఫ్యామిలీ మెంబర్స్‌ అందరి సపోర్ట్‌ పవన్‌కు బాగా గట్టిగా ఉందని చెప్పవచ్చు