ఐటీ రంగంలో ముందున్నారంటే అది బాబు చలవే 

వి.ఆర్.కె ట్రస్ట్ ఆధ్వర్యంలో 275 సైకిళ్ళ పంపిణీ 
మాజీమంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు   

వేమూరు, మహానాడు:   అన్ని దేశాల్లో తెలుగు ప్రజలు ఐటీ రంగంలో ముందున్నారంటే అది చంద్రబాబు నాయుడు గతంలో వేసిన పునాదులేనని మాజీమంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. కొల్లూరు మండలం జువ్వలపాలెంలో వి.ఆర్.కె ట్రస్ట్ తరఫున స్కూల్ పిల్లలకు 275 సైకిళ్ళు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

తొమ్మిది సంవత్సరాలుగా పార్టీలకతీతంగా వి.ఆర్.కె ట్రస్ట్ తరఫున వేములపల్లి రవికిరణ్ సేవలదించారన్నారు. దేశంలోనే ప్రముఖ కాంట్రాక్టర్లలో రవికిరణ్ ఒకరు. పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా ప్రతి ఆదివారం వచ్చి తన స్నేహితుల ద్వారా గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకుని భట్టిప్రోలు మండలంలోని చాలా గ్రామాలకు సహాయం చేయడం అభినందనీయమన్నారు. శ్రీమంతుడు సినిమాలో చూసాం కానీ సినిమా మూడు గంటలు అయిపోతుంది.  ఎవరు చేసేదేమీ ఉండదు కానీ ఈయన నిజమైన శ్రీమంతుడు. నిజంగా సొంత గ్రామానికే కాకుండా మండలంలో ఎవరికి సహాయం కావాలన్నా చేస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తి ఇంకా ఎదగాలని ఇలాంటి వ్యక్తులు ఎదిగితే ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. మంచి మనసుతో విద్యార్థులకు సైకిళ్లు  అందించిన వేములపల్లి రవికిరణ్ ను అభినందించారు.

గతంలో చంద్రబాబు నాయుడు కూడా 20 సంవత్సరాల ముందు విజన్ పెట్టుకున్నాడు కాబట్టే ఇప్పటికీ గవర్నమెంట్లు మారినా ఆయన ప్రవేశపెట్టిన అభివృద్ధి పైన వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు నిలబడ్డాయన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని నిర్వీర్యం చేసింది. అందుకే రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వాన్ని గద్దె దింపి ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారన్నారు. నారా లోకేష్ రథసారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలోకి వెళుతుందన్నారు.

వేములపల్లి రవికిరణ్ గారు మాట్లాడుతూ.. ఆదివారం ఇంటికి వచ్చినప్పుడు నలుగురు పిల్లలు సైకిల్ కావాలని అడిగారన్నారు అది చూసి ఇలా ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారో ఎంక్వయిరీ చేయించమన్నాను. అందరూ స్కూల్ కి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని గమనించి ఏ క్లాస్ వారికి ఆ హైట్ లో ఆడపిల్లలకి మగ పిల్లలకి సపరేటుగా ఎవరికి కావాల్సిన విధంగా వాళ్లకి సైకిళ్ళు తయారు చేయించామన్నారు దీనికి 15 లక్షల రూపాయలు ఖర్చయిందన్నారు. పేద విద్యార్థులకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని భరోసా ఇచ్చారు.