రాష్ట్రం గాడిలో పడాలంటే బాబు రావాలి

టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్‌
3వ డివిజన్‌ ప్రజలతో ఆత్మీయ సమావేశం
పాల్గొన్న తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్‌

విజయవాడ: ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రం గాడి తప్పిందని టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్‌ మండిపడ్డారు. తూర్పునియోజకవర్గం గుణదల ప్రాంతం 3వ డివిజన్‌లోని గరుడ అపార్ట్‌మెంట్‌ వాసులతో శనివారం ఆత్మీయ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి గద్దె రామ్మోహన్‌ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారు జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసుతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా శివనాథ్‌ మాట్లాడు తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరిని అవమానించారు. దుర్మార్గ పాలన అందిస్తున్న జగన్‌ను ఇంటికి పంపించే సమ యం దగ్గర పడిరదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, సీనియర్‌ నాయకులు బొప్పన భవకుమార్‌, యలమంచిలి రాజేంద్రప్రసాద్‌, ఎన్టీఆర్‌ జిల్లా జనసేన సమన్వయ కర్త అమ్మిశెట్టి వాసు, 3వ డివిజన్‌ పార్టీ ప్రెసిడెంట్‌ తాటి బాబురావు, 3వ డివిజన్‌ జనసేన అధ్యక్షుడు గుత్తికొండ కృష్ణమోహన్‌, 3వ డివిజన్‌ బీజేపీ నాయకులు జాస్తి సురేష్‌, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ సభ్యులు దమ్మలపాటి శ్రీనివాసరావు, గరిమెళ్ల శ్రీనివాస చక్రవర్తి, పాములపాటి సాంబశివరావు, దర్శి సురేష్‌, పాలడుగు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.