ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ లో అపార అనుభవం
అమరావతి, మహానాడు: 2014-19 లో సీఎం చంద్రబాబు పట్టుపట్టి కేంద్రం నుంచి తెచ్చుకున్నారు ఆయన్ను. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (APEDB) సీఈవో గా నియమించి.. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించే బాధ్యతను అప్పజెప్పారు. బాబుగారి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చెయ్యకుండా… కియా లాంటి పరిశ్రమల నుండి ఫాక్స్ కాన్, టీసీఎల్, మొండాలెజ్, డిక్సన్ లాంటి వందలాది సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరిపి ఫాలో అప్ చేసి రాష్ట్రానికి రప్పించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయనే జాస్తి కృష్ణకిషోర్.
2010లో ఆదాయపు పన్ను శాఖలో ఉన్నప్పుడు జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును విచారించిన అధికారుల బృందంలో ఆయన కూడా ఉన్నారు. 2010లో జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌పై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దాడులు నిర్వహించి, సోదాల అనంతరం రూ.122.78 కోట్ల భారీ పన్ను విధించింది. ఈ కారణంగా 2019 లో వస్తూ వస్తూనే ఆయనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టి … ఏపీఈడీబీ లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణతో సస్పెండ్ చేసి ఏసీబీ & సీఐడీ కేసులు పెట్టి వేధించారు జగన్మోహన్ రెడ్డి.
ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు ఈయన కూడా క్యాట్ కి పలుమార్లు వెళ్ళాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు క్యాట్ ఈయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో.. తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. తిరిగి ఇన్నాళ్లకు చంద్రబాబును కలిశానంటూ కృష్ణకిషోర్ పేర్కొన్నారు. ఆయన మళ్లీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్ సీఈవోగా రావాలని మరెన్నో పరిశ్రమలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.