రైతుబంధును ఆపింది వారే
బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి
హైదరాబాద్, మహానాడు : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్దేశ పూర్వకంగా రైతుబంధును కాంగ్రెస్ పార్టీ ఆపిందని బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడా రు. కేసీఆర్ భయంతోనే రైతు బంధును మళ్లీ మొదలుపెట్టారు. రైతు బంధును ఎన్నికల కమిషన్ ఆపమని చెప్పింది. ఆ విషయంలో పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి మాటలు నిజమా? భట్టి మాటలు నిజమా? అని ప్రశ్నించారు. రైతుబంధు విషయంలో బీఆర్‌ఎస్ ఎక్కడా ఫిర్యాదులు చేయలేదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెల్లని చెక్కు లాంటిదని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవడం పక్కా అని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని ఊదరగొట్టారు. కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారాయి. సర్వే నివేదికలు చూస్తే రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి దిమ్మ తిరగ టం ఖాయమన్నారు. వాగ్దానాల వరద, నోటి దురద, అబద్ధాల బురద తప్ప రేవంత్ రెడ్డి దగ్గర ఏం లేద న్నారు. ఆయన దేవుళ్లపై ఎందుకు ప్రమాణాలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.