నల్గొండ, మహానాడు: రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘుబాబుకు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్ నాయకుడు మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. నల్గొండ టూటౌన్ పోలీసులు రఘబాబును శనివారం కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేశారు.