అమరావతి: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మంగళవారం వివిధ కేసులలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన ప్రతిరోజూ పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని సూచించింది. మాచర్ల వెళ్లకూడదని, నరసరావు పేటలో ఎక్కడ ఉంటారో పూర్తి చిరునామా, మొబైల్ నెంబర్ పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని పేర్కొంది. పాస్‌పోర్టు కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది.