అమరావతి: “అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండో సారి ఘనవిజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయం అమెరికా-భారత్ సంబంధాలలో కొత్త శకానికి నాందిగా నిలుస్తుంది. అన్ స్టాపబుల్ గా విజయం సాధించిన విధంగా భారత్-అమెరికా ల మధ్య కూడా అన్ స్టాపబుల్ గా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని, అభివృద్ధిలో పరస్పర సహకారం అందించాలని కోరుతున్నాను. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, భద్రతకు సహకరించాలని కోరుతున్నా ” ను అంటూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండో సారి ఘనవిజయం సాధించిన ట్రంప్‌ను అభినందించారు.