– బంగ్లాదేశ్ ప్రధాని ప్రధాని హసీనా రాజీనామా
పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ బంధు ముజ్పూర్ రెహమాన్ కుమార్తె, ఆరోజు జరిగిన ముష్కరులు జరిపిన దారుణ కాండలో చనిపోకుండా మిగిలిపోయి ఉన్న వారసురాలు షేక్ హసీనా వాజేద్ ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్నారు. మన ఇండియాకు చాలా దగ్గరి సోదరిగా/ఆత్మీయురాలిగా పేరుపొందారు.
ఆవిడ హయాంలోని ఆ దేశానికి అనుకూలంగా అనేక నిర్ణయాలు మన దేశం కూడా తీసుకుంది. భూభాగం కూడా వారికి లాభం జరిగేటట్లు వ్యవహరించింది. రెండు దేశాల మధ్యన అలా ఉండాల్సిన మంచి బంధాల గురించి ఆ నిర్ణయం తీసుకున్నారనీ భారత ప్రభుత్వంలోని పెద్దలు నాడు వివరించారు.
ఆవిడ మీద భయంకరమైన అసమ్మతి చాలా కాలంగా ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఆవిడ చాలావరకు అణిచివేశారు. ఆ గ్యాంగులు అలాగే సహజంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కు వ్యతిరేకంగా ఉండే వర్గాలన్నీ ఒకటయ్యాయి . 1970లలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో అమరులైన త్యాగాలు చేసిన వాళ్ల కుటుంబాలకు 30% ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టడంపై యాంటీ రిజర్వేషన్ ఉద్యమం జూలై నెలలో ఊపందుకుంది.
జులై 16 జరుగుతున్న గొడవల్లో దాదాపు 300 మంది చనిపోయారు, 1500 మంది గాయాల పాలయ్యారు. నేడు ఏకంగా ప్రధానమంత్రి నివాసం మీదే అల్లరి మూకలు దాడి చేయడం పుస్తకాలు, సామాన్లు ఎత్తుకుపోవటం ఇవన్నీ జరిగాయనీ, దాంతో తన సోదరితో సహా ప్రధానమంత్రి ఆర్మీ హెలికాప్టర్లో వేరే చోటికి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. రాజీనామా చేశారని అంత ముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్న వకార్ ఉర్ జమాన్ నేతృత్వంలో ఆ దేశంలో సైనిక పాలన పెట్టటానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తుంది.
ఆయన మామ కూడా 1997 నుంచి 2000 సంవత్సరం వరకు బాంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ చేశారు. వారు హసీనాకు దగ్గర బంధువులు. ఇక జియావుర్ రహిమాన్ భార్య ఖలేదా జియా 1991 నుంచి 96, 2001 నుంచి 2006 అనగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆవిడ నేషనలిస్టిక్ పార్టీకి కూడా ఇండియా అంటే ఎందుకో పడదు. పాకిస్తాన్ అనుకూల శక్తులు చాలా భయంకరంగా పొంచి ఉన్నాయి.
బంగ్లాదేశ్ తో ఉన్న బోర్డర్ చాలా సున్నితమైనది. మనం దాన్ని కాపాడటం చాలా కష్టం. 1970లో దాదాపు కోటి మంది శరణార్థులు మన దేశానికి రావడం జరిగింది. అప్పటి ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అనేకసార్లు భుట్టో కి చెప్పినా వినని కారణంగా, మన దేశం మీద విద్వేషం పెంచుతున్న కారణంగా మన దేశ సరిహద్దులకే భంగకరంగా ఉండే పరిస్థితి వచ్చినందువలన.. బంగ్లాదేశ్ కి సైన్యాన్ని నడిపించి ఆ దేశాన్ని పాకిస్థాన్ కబంధహస్తాల నుంచి విముక్తి చేసి ఆ దేశానికి స్వాతంత్రం ఇచ్చారు.
దాంతో రగులుకుపోయిన పాకిస్థాన్ యుద్ధం చేసినా వాళ్ళ పీచము అనిచి ఇండియాని ఉన్నతంగా నిలిపారు. అదే స్ఫూర్తితో సిక్కింపై కూడా కుట్రలు చేస్తున్న దాన్ని ఛేదించి ఆ సిక్కిం రక్షిత దేశాన్ని ప్రజాస్వామ్యయుతంగా మనదేశంలో కలుపుకున్నారు. అప్పటినుంచి బంగ్లాదేశ్ లో పొంచి ఉన్న ఇండియా వ్యతిరేకులు ఎప్పుడెప్పుడు అని ఆదును చూస్తున్నారు.
ఇప్పుడు ఇండియా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ per capita income, అలాగే గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత అద్భుతంగా పెరిగాయో గత పదిహేనెళ్లల్లో జనాలకు తెలుసు. కానీ భావోద్వేగాలు ఉన్నప్పుడు వాస్తవాలు అర్థం కాదు. మరో పక్క దుర్మార్గమైన చైనా ప్రభుత్వం అనేక కుట్రలతో పొంచి ఉంది, ఇప్పటికే బాంగ్లాదేశ్ లో కొంత వేలు పెట్టి ఉంది.
మన తెలుగువారికి ఆ బెంగాలీయులకి ఎందుకనో చాలా సాపత్యాలు ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఈ సున్నిత పరిస్థితులలో మన దేశం మంచి నిర్ణయం తీసుకుంటుందని ఈ విషయంలో మన ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఈ విషయంలో మనందరం అండగా ఉండాలి. మన దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా ఏమి జరిగినా ఊరుకోకూడదు. బంగ్లాదేశ్ లో కూడా ప్రజాస్వామ్యం ఉండాలి, మత తీవ్రవాదం అసలు ఉండకూడదు