కూటమికి బీసీ సంఘాల మద్దతు

చంద్రబాబును కలిసిన కేశన శంకర్రావు

గుంటూరు, మహానాడు: ఎన్డీఏ కూటమికి బీసీ సంఘాల మద్దతు అందిస్తామని రాష్ట్ర బీసీ నాయకుడు కేశన శంకర్రావు చెప్పారు. టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం గుంటూరు పార్లమెంట అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వ ర్యంలో శంకర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ బీసీ సంఘాల సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబును కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు న్యాయం చేసేలా పనిచేస్తామని బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలను ఏకం చేసి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విజయం చేకూరేలా పని చేస్తామని ఈ సందర్భంగా శంకర్రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్రంలోని పలువురు బీసీ సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు.