తెలుగుదేశం పాలనలోనే బీసీలకు న్యాయం

నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు
వినుకొండ: బీసీలు అంటే తెలుగుదేశం…తెలుగుదేశం అంటేనే బీసీలని నరసరావుపేట టీడీపీ పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. శుక్రవారం సాయంత్రం వినుకొండ ఎంపీడీవో కార్యాలయం ఎదురు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విజయాన్ని కాంక్షిస్తూ జయహో బీసీ సభ నిర్వహిం చారు. నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున అన్ని కులాల చెందిన బీసీలు హాజ రయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు న్యాయవాది సైదారావు అధ్యక్షత వహించారు.

ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్‌ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే నేడు జగన్‌ ప్రభుత్వం 24 శాతానికి కుదించిందన్నారు. జగన్‌ రెడ్డికి బీసీలపై ఎటువంటి ప్రేమ లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్‌ సదుపాయం కలుగజేయడం జరుగుతుందని. గతంలో మాదిరిగానే బీసీ కార్పొరేషన్‌. బీసీలకు రుణాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ నాడు బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది స్వర్గీయ ఎన్టీఆర్‌ అని, నాటి నుండి నేటి వరకు బీసీలను ఆదరిస్తూనే ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను వెంటాడి చంపుతుంటే ఆనాడు మంత్రిగా ఉన్న అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.

మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ. గతంలో పదిమంది వరకు వినకొండ ఎమ్మెల్యేలుగా పనిచేశారని ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, నేడు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు టీడీపీ హయాం లో తెచ్చిన నిధులతో అరకొర పనులు చేసి అన్ని తానే చేశానని గొప్పలు చెబుతున్నాడని అన్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బీసీలకు అండగా టీడీపీ ఉందన్నారు. వైసీపీలో అవమానాలు భరించలేకనే టీడీపీలోకి తరలివస్తున్నారని అన్నారు. పదవుల కోసం తాను ఎప్పుడు ప్రాకులాడలేద న్నారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా బీసీ నేతలు కనకాచారి, పలువురు ఎమ్మెల్సీలు, బీజేపీ నేతలు మేడం రమేష్‌, యార్లగడ్డ లెనిన్‌ కుమార్‌, జనసేన నేతలు శ్రీనివాసరావు, బీసీ నేతలు పాల్గొన్నారు.