ఉచిత ఇసుక సరఫరాపై  జాగ్రత్త వహించాలి 

– సంయుక్త కలెక్టరు ఏ.భార్గవ్ తేజ

గుంటూరు, మహానాడు:  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక సరఫరాలో తగు చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టరు ఏ.భార్గవ్ తేజ అధికారులకు సూచించారు. శుక్రవారం సంయుక్త కలెక్టరు భార్గవ్ తేజ కొల్లిపర మండలంలోని కొల్లిపర, మున్నంగి, తాడేపల్లి మండలంలోని గుండిమెడ ఇసుక స్టాకు పాయింట్లు, ఇసుక రీచ్ కేంద్రాలను సందర్శించారు. సిబ్బంది ఇసుకను ఏ విధంగా సరఫరా చేస్తున్నారో పరిశీలించారు.

ఇసుక కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉచితంగా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు రూపొందించిందన్నారు. ఆ మేరకు ప్రజలకు అవసరమైన ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మంగళగిరిలోని ఎంఎల్ఎస్ పాయింట్ ను సందర్శించి  సందర్శించారు. మంగళగిరి, తాడేపల్లి  అర్బన్, రూరల్ మండలాలు, దుగ్గిరాల మండలాల ఎఫ్పీ షాపులకు తూకం ప్రకారం రేషన్ బియ్యం, ఐసీడీఎస్, మిడ్ డే మిల్స్ కు సంబంధించిన సరుకుల పంపిణీ పరిశీలించారు. ఎప్పటికప్పుడు వచ్చిన స్టాకు, పంపిణీ వివరాలను డిస్ప్లేలో చూపించాలని అధికారులకు సూచించారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తెలియజేశారు.