నికార్సయిన ఉద్యమకారుడిని…
ప్రజల కోసం జైలుకుపోయే దమ్మున్న వాడిని
నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు
వారికి బ్రోకర్లు అనే పేరుంది..
జిల్లా రాజకీయాల్లో వెదవులు వాళ్లు
కేసీఆర్ జోలికొస్తే తన్ని తరిమేస్తాం
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై బీఆర్‌ఎస్ నేత జగదీష్‌రెడ్డి ఫైర్
నల్గొండ, మహానాడు : కోమటిరెడ్డి సోదరులపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం నల్గొండ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి సాగర్ నీటిని ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్ వద్ద ముడుపులు తీసుకున్న వెదవలు కోమటిరెడ్డి సోదరులని మండిపడ్డారు. ఆయన ఇచ్చిన భిక్షతో బతికోనోళ్లు కేసీఆర్‌పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు…నోరు అదుపు లో పెట్టుకోకుంటే జాగ్రత్త బిడ్డ లాగు విప్పి కొడతాం అంటూ హెచ్చరించారు.
పదవుల కోసం రేవంత్ బూట్లు తుడవడానికి పోటీ పడుతున్న కోమటిరెడ్డి అన్నదమ్ములు…ఆయన సంక నాకుతూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి ఓటేయాలని చెప్పిన దగాకోరు కోమటిరెడ్డి అని మండిపడ్డారు. ఆగర్భ శ్రీమంతుల్లాగా బిల్డప్ ఇస్తున్నారు…నా చరిత్ర ఎంటో, మీ చరిత్ర ఎంటో చర్చ పెడదామా? నువ్వు పుట్టి పెరిగిన ఇల్లు, నేను పుట్టి పెరిగిన ఇల్లు చూస్తే అర్థం అయితది ఎవడికి తినడానికి తిండి లేకుండెనో…నడమంత్రపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి సోదరుల బలుపు అణగదొక్కుతాం…జిల్లాకు పట్టిన శని వారు..సంస్కారం లేని వెదవులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ స్థాయి ముందు నిజంగానే లిల్లీ ప్రూట్ గాళ్లని వ్యాఖ్యానించారు. రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషే… బీజేపీలోకి పోతాడని కాంగ్రెస్ మంత్రులే లీక్‌లు ఇస్తున్నారు..కేసీఆర్ జోలికొస్తే తన్ని తరిమిస్తామని హెచ్చరించారు.