హిందూపూరం ఎంపీ అభ్యర్థి బి.కె.పార్థసారథి
సత్యసాయి జిల్లా పుట్టపర్తి, మహానాడు: ఏ సమస్య వచ్చినా కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటానని తనను ఆశీర్వదించాలని హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కె.పార్థసారథి కోరారు. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండల కేంద్రంలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. పార్థసారథితో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నా రు. పార్థసారథి మాట్లాడుతూ కష్టనష్టాల్లో ఏ సమస్య వచ్చినా వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా సింధూర రెడ్డిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.