కూటమి వస్తే వారికి న్యాయం
టీడీపీ హయాంలోనే బీసీలకు పెద్దపీట
దర్శిలో 16న జయహో బీసీ సభ
ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ
ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: జగన్ పాలనలో బీసీలు అన్యాయానికి గురయ్యారని ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ విమ ర్శించారు. దర్శిలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు. నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఈ నెల 16న సాయంత్రం 4 నాలుగు గంటలకు దర్శిలో నియోజకవర్గ స్థాయిలో జయహో బీసీ సదస్ ఏర్పాటు చేయటం జరిగిందని, నియోజకవర్గం బీసీ సోదరులు వేలాదిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచే బీసీలకు పెద్ద పీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు.
బీసీల ఓట్లను దండుకునేందుకు బీసీల మధ్య కులాల కుంపట్లు రేపుతూ ఒక్కసారి అధికారం అంటూ జగన్ ప్రభుత్వం వారితో ఊడిగం చేయిం చిందని విమర్శించారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఉన్న గురజాలకు చెందిన జంగా కృష్ణమూర్తి వైసీపీకి రాజీనామా చేసి పార్టీలో చేరటం ఇందుకు ఉదాహరణ అన్నారు. ఇలా బీసీలకు ద్రోహం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీసీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కూటమి వస్తే రాష్ట్ర శాసనసభలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టి ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. అలాగే అన్ని స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపి ప్రకటించిందని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు స్వయం ఉపాధి కోసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిందని, బీసీ డిక్లరేషన్‌తో అన్నివిధాలా ప్రాధాన్యం ఇస్తూ బీసీలకు రాజ్యాధికారం కల్పించేందుకు తెలుగుదే శం కృషిచేస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.