పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట, మహానాడు: పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు వారికి అందించే ప్రతి వైద్య సేవలోనూ బాధ్యతగా అన్ని స్థాయిలలో ఆసుపత్రిలో సేవలు అందించాలని పేర్కొన్నారు. పట్టణంలోని ఆస్పత్రి డెవలప్‌మెంట్‌ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ హరికృష్ణ మెంబర్‌ కన్వీనర్‌ హోదాలో అజెండా అంశాలపై కమిటీకి నివేదించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, హాస్పటల్ డెవలప్మెంట్ మెంబర్స్ ఎలమంచిలి వెంకటలక్ష్మి, పద్మనాభుని కుటుంబరావు, గుడిసె నాగేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.