Mahanaadu-Logo-PNG-Large

3.5 లక్షలకు పైగా కాన్సర్ బాధితులకు ఉత్తమ చికిత్స

– బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్. చైర్మన్ నందమూరి బాలకృష్ణ

మా అమ్మ గారు స్వర్గీయ బసవతారకం క్యాన్సర్ మహమ్మారి కారణంగా మరణించడంతో కలత చెందిన మా తండ్రి , మా కుటుంబంలో జరిగిన విషాదం మరో కుటుంబంలో జరగకూడని భావించి స్థాపించిన హాస్పిటల్ మా ఈ బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్.

ఆరోజు మా నాన్న మదిలో జన్మించిన ఆలోచనతో ప్రారంభమైన హాస్పిటల్ నేటికి 24 వసంతాలు పూర్తిచేసుకుంది, 650 పడకలతో, 1800 పైగా సిబ్బందితో, ఇప్పటి వరకు 3.5 లక్షలకు పైగా కాన్సర్ బాధితులకు ఉత్తమ చికిత్సని అందించటం జరిగింది.

క్యాన్సర్ పై మా ఈ పోరాటంలో మాకు వెన్నుదన్నుగా నిలిచిన దాతలకు, నిపుణులైన వైద్య సిబ్బందికి,అంకితభావంగల సహాయ సిబ్బందికి, సహకరిస్తున్న ప్రభుత్వాలకు, అధికారులకు, అభిమానులకు, పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు