సరైన సమయంలో సాగునీరు విడుదలతో మేలు

– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట, మహానాడు: వత్సవాయి మండలం పోలంపల్లి లిఫ్ట్ స్కీమ్ వద్ద పోలంపల్లి, పెంట్యాలవారిగూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని సోమవారం నీటిని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఆంధ్ర, తెలంగాణ రైతులకు సుమారు మూడువేల ఎకరాలకు సరైన సమయానికి సాగునీరు అందుతుందన్నారు. ఇది రైతాంగానికి ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎత్తిపోతల పథకం చైర్మన్ పెంటేల వెంకటేశ్వరరావు, వత్సవాయి మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు వడ్లమూడి రాంబాబు, సీపీఎం జిల్లా నాయకులు చిరుమామిళ్ళ హనుమంతురావు, అధికారులు ఇంకా వివిధ హోదాల్లో ఉన్న నాయకులు రైతులు పాల్గొన్నారు.