భద్రాచలం రామయ్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం

ఎట్టకేలకు ఎన్నికల కమిషన్‌ అనుమతి

ఖమ్మం, మహానాడు : తెలుగువారి అయోధ్య భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్‌ ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. తొలుత ఎన్నికల నియమావళి ప్రకారం ప్రత్యక్ష ప్రసారం చేయరాదని ప్రకటించింది. కోట్లాదిమంది ఆరాధ్య దైవం భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం ప్రతి ఘట్టం సమగ్రం గా వివరిస్తూ ఆ దేవ దేవుని సన్నిధిలో చూసి తరించేవారు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాజకీ యాలు అడ్డుపడే ప్రయత్నం జరిగినా చివరికి భక్తుల కోరిక భగవంతుడు నెరవేర్చాడు. ఎన్నికల కమిషన్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీంతో అందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.