ప్రయాగ్‌రాజ్‌లో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత
ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలు ఎండలతో మండి పోతున్నాయి.. ఉత్తర భారతంలో వేడి గాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భానుడు భగ్గున మండిపోతున్నాడు. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 17 వరకు అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడిరచారు.