జైలు నుంచి భాను విడుదల

హైదరాబాద్: పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడైన భానుకిరణ్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. భాను గత 12 ఏళ్లుగా చంచల్ గూడ జైల్లోనే ఉంటున్నాడు. 2011 జనవరి 4న మద్దెలచెరువు సూరిని హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్ కు 2018 డిసెంబర్ లో నాంపల్లి కోర్టు శిక్షను ఖరారు చేసింది. 12 ఏళ్ల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు.