పెదకూరపాడు, మహానాడు : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను అయన నివాసంలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై భాష్యం ప్రవీణ్ చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.