విశాఖ నుంచి ఖమ్మం కు హెలికాప్టర్ తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్న భట్టి

ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు వరద ఉధృతి వల్ల ఖమ్మం పట్టణం ప్రకాష్ నగర్, తీర్థాల, వాల్యతండా లో కొంతమంది చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో ఫోన్లో మాట్లాడి చెప్పారు. అయితే హైదరాబాదులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ రావడానికి అనుకూలంగా లేకపోవడంతో విశాఖపట్నం నుంచి తెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత అధికారులతో భట్టి విక్రమార్క ఫోన్ లో ఈ విషయమై మాట్లాడారు.