నూజివీడు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌

టీడీపీలోకి 40 మంది వైసీపీ నాయకులు
కండువాలు కప్పి ఆహ్వానించిన లోకేష్‌

అమరావతి: నూజివీడు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో 40 మంది ప్రస్తుత ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, వైసీపీ బీసీ, ఎస్సీ, యూత్‌ సెల్‌ నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వారికి నారా లోకేష్‌ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ జగన్‌ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి నిర్మించుకోవటానికి ప్రతిఒక్కరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా చేరినవారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషిచేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో తులిమిల్లి కృష్ణకుమారి, తులిమిల్లి రంగారావు, చీలి లక్ష్మి, చీలి అర్లప్ప, సాయిల పంగిడయ్య, మనికల వెంకటేశ్వరరావు, తాలకొండ నాగరాజు, తాలకొండ వెంకటేశ్వరరావు, పిన్నిబోయిన పంగిడయ్య, మనికల పొన్నయ్య, వలసపల్లి నారాయణమూర్తి, కూరపాటి సత్య నారాయణ, వలసపల్లి పూర్ణచంద్రరావు, రాయల సూర్యనారాయణ, కురకుల ఏడుకొండలు, కాజా రాంబాబు, చెన్ను నాగయ్య, నీలం నల్లయ్య, వేమారెడ్డి చిట్టిబాబు, కాజా కిషోర్‌, కాజా పోతురాజు, పాలకుర్తి కోటయ్య, సోలా లక్ష్మీదుర్గ, ముడి తిరుపతిరావు, బత్తుల మాధవరావు, చలసాని భాస్కర్‌, చల్లగుళ్ల నాగాంజనేయులు, పెనుగంటి నాగేశ్వరరావు, నత్తా నాగేశ్వరరావు, రెంటపల్లి సాయికుమారి, రెంటపల్లి రాజ్‌కుమార్‌, బుర్రి సుధాకర్‌, కత్తుల కిషోర్‌కుమార్‌, కోలవెంటి ప్రేమ్‌చంద్‌ తదితరులు ఉన్నారు.