బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ తీర్మానం చేసింది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ఇచ్చేలా డిమాండ్ చేయాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించింది. కాగా, జేడీయూ ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్ సాధనకు కృషి చేయాలని భావిస్తోంది.