పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదికలో శనివారం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు కేక్ కట్ చేశారు. ధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి శంఖం పూరించిన సమరయోధుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.