ఆంధ్రా అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది

– అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం అనుమతి
– బీజేపీ రాష్ట్ర ఆఫీసు వద్ద సంబరాలు
– ముఖ్యఅతిథిగా మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

విజయవాడ, మహానాడు: అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం అనుమతి మంజూరు చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలు ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆనందం పంచుకుంటూ మిఠాయిలు పంచిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు కు అనుమతితో పాటు నిధులు మంజూరు చేసిన సందర్భంగా బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. బీజేపీ ప్రభుత్వం 2,545 కోట్ల రూపాయలతో అమరావతి నుండి నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఒకరకంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి ఇది చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. అకాల వర్షాలతో, పర్యావరణ మార్పుతో ఇబ్బందులకు గురవుతున్నాం. దానికి అనుగుణంగా అడవులను పాడు చేయకుండా ఈ రైల్వే లైన్ వేయడం వలన 25 లక్షల మొక్కలను నాటే అవకాశం ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే కేంద్రం 25, 000 కోట్లు ఇచ్చింది. అదేవిధంగా బడ్జెట్ లో కూడా అనౌన్స్ చేశారు 25,000 కోట్లు కేటాయించినట్టు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే జోన్ నిర్మాణం కోసం ఇంతకు ముందు ప్రభుత్యాన్ని కోరగా వారు ఇచ్చిన భూమి దానికి అనుకూలం గా లేనందున ముందుకు వెళ్ళ లేకపోయాం. ప్రస్తుత ప్రభుత్వం స్థలం మంజూరుకు సిద్ధం గా ఉన్న దృష్ట్యా నాలుగు మాసాలు లో రైల్వే జోన్ పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది. అందరి ఆకాంక్ష తో ఎంత త్వరితగతిన అయితే అంత తొందరగా పూర్తి చేస్తాం. మేం మొదటి నుంచి చెపుతూనే ఉన్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృధి జరిగితుంది అని.. దానికి అనుగుణం గానే ఈరోజు అమరావతి కి సుమారు 57 కి.మీ. రైల్వే లైన్ ను మంజూరు అయింది. జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, పార్టీకి సంస్థాగత ఎన్నికల రాష్ట్ర రిటర్నింగ్ అధికారి పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, నేతలు ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు, కిలారు దిలీప్, శ్రీధర్, మువ్వల వెంకట సుబ్బయ్య, బొడ్డు నాగలక్ష్మి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నరసరాజు, మహిళా మోర్చా నేతలు గాయిత్రి, బొమ్మ దేవర, రత్న కుమారి, తదితరులు పాల్గొన్నారు.